వంటగదిలో పని ఎంతో సమయం తీసుకుంటుంది.త్వరగా వంట ముగించాలంటే కొన్ని చిట్కాలు గుర్తుంచుకోవాలి.బంగాళాదుంపలు ముందే కోసి నీళ్లలో పడేసి ఉంచితే రంగు మారవు.చల్లని నీళ్ళలో వేసి ఉంచాలి.టమాటోలు వేడినీళ్ళలో వేసి కాసేపు ఉంచి వాటిని వెంటనే చల్లని నీళ్ళలో వేస్తే తోలు త్వరగా ఊడి వస్తుంది.పుదీనా తాజాగా ఉండాలంటే వాటిని గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఉంచాలి నిమ్మకాయ రసం పూర్తిగా రావాలంటే వాటిని మైక్రోవేవ్ లో పది సెకన్ల పాటు పెట్టాలి అది మెత్తగా అయి రసం పూర్తిగా వస్తుంది.చపాతీ పిండిలో కాసిన్ని పాలు పోసి కలిపితే అవి మెత్తగా వస్తాయి.

Leave a comment