తాజాగా తీసిన పండ్ల రసాలు చాలా రుచిగా ఉంటాయి.అయితే ఏ రసం తాగిన ఆ పండ్లలో గుజ్జు మొత్తం జ్యూస్ లో ఉండాలి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకుర్చగల కివిలో యాంటీఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు రసంలోని పాలి శాచురైడ్స్ శరీరంలో కొల్లజెస్ సింథిసిన్ ను రెండింతలు చేస్తాయి. ఇదే చర్మం ,కండరాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతోంది. చర్మం ,ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే లూటెన్ అనే యాంటి ఆక్సిడెంట్ ను ,కెరోటినాయిడ్స్ ను కివి పండు సరఫరా చేస్తుంది. కివి పండు చెక్కు తీసి బ్లెండ్ చేయాలి. నిమ్మరసం పిండి ఐస్ క్యూబ్స్ తో చల్లబరిచి తాగితే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment