ఈ సెలబ్రెటీ సీజన్ ఎదురుగ్గా క్రిస్మస్ న్యూఇయర్ వచ్చేస్తూ ఉండగా ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల వస్తువులకూ ప్రత్యేక రూపం ఇచ్చి షోకేస్ లో పెట్టేస్తోంది. అన్ని రకాల దుస్తులు చెప్పులూ ఉండగా క్లచ్ తో మాత్రం తీసిపోయాయా. కన్నుల కింపుగా వుండే క్లచ్ లు ఫ్యాషన్ పోకడ లో ముందే వున్నాయి. ఒక యాడ్ లో గోల్డెన్ టచ్ ఉన్న చిక్ మెటాలిక్ బ్యాగ్ చూడండి. కింగ్ మైకాన్ కూడా ఈర్ష్య పడతాడు అంటారు. అలాగే డే క్లచ్ చుస్తే మిగతా షాపింగ్ చేసిన వస్తువులు అలా వదిలేసి ఈ బాగ్ పట్టుకు పోతారు అంటారు. ఇంకో క్లచ్ ఖరీదు ఐదు వెలట. అనవసరంగా వజ్రాలే మెరుస్తాయి అనుకుంటారు/నిజానికి మా బ్యాగే ఒక వజ్రం అంటారు. ఒక డిజైన్ ఊహించటం దాన్ని అనుకున్నంత అందంగా తయారు చేయటం మార్కెట్ చేయటం మాటల్లో పనికాదు. ఒక కంపెనీ వాడు చెప్పుకొంటునట్లు  బ్యాగ్స్ ని కొనటం అంటే ఒక ఆర్ట్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడం లాగా అన్నమాట. ఇంటికి అందం అద్భుతమైన పెయింటింగ్. అలాగే అనామికా కన్నా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకున్న జమ్మి శాండల్స్  వేసుకున్న చేతిలో పర్ ఫెక్ట్ క్లచ్ లేకపోతే ఫ్యాషన్ రూపం రానట్లే. ఉమెన్స్ క్లచ్ బ్యాగ్స్ ఇమగెస్ చుస్తే ఎన్నెన్ని డిజైనర్ బ్యాగ్స్ ఉన్నాయో తేలిపోతుంది.

Leave a comment