రోజంతా బిజీ షెడ్యుల్ మాములు పనులకే టైం లేదు. మరింక నాజుగ్గా వుండాలంటే శరీరాన్ని దృడంగా ఉంచుకోవాలంతే వ్యాయామం ఎప్పుడు చేయాలి? జిమ్కి వెళితే నిపుణుల పర్యవేక్షణ వుంటుంది. కానీ ఇంట్లో వుంది సాధన చేస్తాం అంటే మాత్రం ఎన్నో సందేహలోస్తాయి. అసలు చేయకపోవడం కంటే ఎదో కొంత మాత్రం చేస్తే చలంటుంది? ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారంటే కనీసం వారానికో రోజులో కూడా వ్యాయామం మొదలెట్టవచ్చు అంటున్నారు. అది ఏ రకమైన వర్కౌట్ అయినా పర్లేదు నడకా, యోగా ఏదైనా సరే క్రమంగా పెంచుకుంటూ కొన్నాళ్ళకి ప్రతి రోజుకు అలవాటు పడండి అంటున్నారు. జిమ్ కు కూడా అక్కర్లేదు ఇంట్లోనే ధ్రెడ్ మిల్ పైన చేసినా చాలు. అన్ని మెరుగైన ఫలితాలే. మంచి నిద్ర కూడా పడుతుంది. ఉదయాన్నే చేయగలిగితే మంచిది. తేలిక పాటి వ్యాయామం చేస్తున్నప్పుడు ఉదయం వేళ ఎమీ తినకున్నా పర్లేదు. అదే కాస్త కతినమైన వ్యాయామం ఎంచుకుంటే పోషకాహారాన్ని తీసుకోవాలి. అదీ వ్యాయామానికి గంట ముందే తీసుకోవాలి.

Leave a comment