లోదుస్తుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా బ్రా విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు .ఏడాదికి ఒక సారి కొలతలు మారాయేమో చూసుకొవాలి. ఏళ్ళ తరబడి వాటిని వాడవద్దు పట్టీలు వదులుగా అనిపించగానే మార్చేయాలి. వాషింగ్ మిషన్ లో పడేయకుండా సబ్బులో చేత్తో ఉతకటం మేలు. ఉతికాక వేలడేలా ఆరేస్తే పట్టీలు సాగిపోతాయి. బ్రా అతికినట్లు కాకుండా శరీరాన్ని బట్టి ఎంచుకోవాలి. బుజాలు సన్నగా ఉంటే క్రాస్ బ్యాక్ బ్రాలు నప్పుతాయి. వీపు భాగం వెడల్పుగా ఉంటే బాల్కనీ సేప్ బ్రా బావుంటుంది. ఇలా శరీరాన్ని బట్టి బ్రాలు ఎంచుకోవటం క్షేమం..

Leave a comment