షాపింగ్ విషయంలో వినియోగదారులు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకొనేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో 89 శాతం మంది వినియోగదారులు పెద్ద ప్రణాళిక లేకుండానే షాపింగ్ కు బయలుదేరుతారు. సగం మంది సరసమైన ధరలు ఉంటే కొందాము అనుకొంటారు. 28 శాతం మంది రాయితీలు ఆఫర్ల కోసం అడుగుముందుకు వేస్తారు. ఎక్కడ దొరకని ప్రత్యేకమైన వస్తువుల కోసం 22 శాతం,మంది,ఎవళ్ళో బావుందని చెప్పారు కదా అవి ఆరోవంతు మంది షాపింగ్ చేస్తారట తమ ఎంపికలు ప్రకటనల సాయం వుంటుందని 35 శాతం మంది,క్రెడిట్ కార్డ్,డెబిట్ కార్డు సౌకర్యం ఉంటేనే కొంటామని కొంతమంది కిటకిట లాడే కౌంటర్లు ఉంటే మావల్ల కదాని ఇంకొంత మంది ఈ సర్వే లో తమ అభిరుచిని ప్రకటించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే 90 శాతం మంది ప్రతి సంవత్సరం జీతంలో 20 శాతం షాపింగ్ కే కేటాయిస్తామన్నారు.

Leave a comment