Categories
WoW

కాంక్రీట్ జంగిల్ లో వాటర్ ఫౌంటెయిన్లు

ఫౌంటెయిన్స్ అంటే అంతెత్తు నుంచి ఎగిసిపడే చిన్నపాటి జలపాతాలే కానక్కరలేదు. ఇంట్లో టీపాయ్ పైన అమర్చుకొనే చిన్న బరువు లేని బొమ్మ కూడా కావచ్చు. సన్నటి శబ్దం చేస్తూ గలగలా ప్రవహించే నీటిలో ఇంట్లో, డ్రాయింగ్ రూమ్ లో ఒక మూల కొలువుదీరిన కళాకృతి వుంటే ఎంత అందం. నేటి గృహాలంకరణ డిజైనర్లు కృత్రిమ రాళ్ళూ, మొక్కలు, చక్కని బొమ్మలు, రంగుల దీపాలు మధ్యలో నీటి ప్రవాహం అందులోంచి చక్కని పాట కలిపేసి ఇండోర్ వాటర్ ఫౌంటెయిన్లు తయారు చేసేస్తున్నారు. ఇత్తడి, కంచు లోహాలు, గ్రానైట్ మార్బుల్ రాళ్ళు, గాజు, సిరామిక్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఫైబర్ గ్లాస్, చెక్క వంటి అనేకం కలగలిపి ఈ ఫౌంటెయిన్ ను రూపొందిస్తున్నారు. వీటిలో వాడే రాళ్ళు ఎంతో సహజంగా బరువున్నట్లే కనిపిస్తాయి కానీ వాటిని ప్లాస్టిక్ తోనో, రెజిన్ తోనో తయారు చేస్తారు కనుక తేలిగ్గా ఉంటాయి. నీటి గలగలలు వినడం వల్ల నరాలకు సాంత్వన కలుగుతుందని నిపుణులు చెపుతున్నారనుకోండి, ముoదు ఇమేజెస్ చూడండి.

Leave a comment