గుళ్లో భగవంతుడి విగ్రహం కనిపిస్తుంది కానీ ఒక కొండ భగవంతుడి ప్రతిమ లాగా ఉంటే 71 అడుగుల ఎత్తులో మూడు అంతస్తుల్లో పీఠం వేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్న సిద్ధి వినాయక ఆలయం గుజరాత్ లోని మహేమదావద్ పట్టణంలో ఉంది. లోపల మూల విరాట్ తో పాటు చైనా, ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా ఇలా తొమ్మిది దేశాలకు చెందిన వేరు వేరు గణేశుడి ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్నో గణపతి శిల్పాలు మూషికాలు ఉంటాయి. ఈ ఏకదంతుడి దర్శనం కోసం భక్తులు ప్రతి నిత్యం వస్తారు.

Leave a comment