Categories
థ్రిల్ , ఎంజాయ్ మెంట్ లేకుండా జీవితం చాలా డల్ గా ఉంటుంది అనుకునేవాళ్ళు కోకొల్లలు. అలాంటి వాళ్ళు, సాహసాలు ఇష్టపడేవాళ్ళ కోసం ఓ గొప్ప గ్లాస్ హోటల్ ఉంది. పేరూ లోని సెక్రెడ్ వ్యాలి 400 అడుగుల ఎత్తున ఈ హోటల్ కట్టారు. నాచురా వివె స్కైలాడ్జ్… మూడు క్యాప్సూల్ సూట్స్ ఉంటాయి ఇందులో ఎనిమిది మంది ఒక్కేసారి బస చేయవచ్చు. ఒక్క రూమ్ లో నాలుగు చైర్లు ,ఓ డైనింగ్ టేబుల్,ఓ బెడ్ రూమ్,టాయ్ లెట్ సింక్ ఉంటాయి. ఈ గ్లాస్ హోటల్ కి అలానడిచి పోవాలంటే కుదరదు నడుము చుట్టు వైర్లు బిగించుకొని 400 అడుగుల కొండ ఎక్కాల. ఈ థ్రిల్ కోసం ఎంతో మంది ఈ హోటల్ లో రూమ్స్ బుక్ చేసుకుంటుంటారు