గులాబీ వర్ణంలో ఉండవలసిన గోళ్ళు నెమ్మదిగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. నెయిల్ పాలీష్ వేసుకోకపోతే ఇంకా చూడలేం అని పిస్తుంది. కానీ అలా పసుపు వర్ణంలోకి మారటానికి కారణం గోళ్ళ రంగే అంటున్నారు .నెయిల్ పాలీష్ ,పాలీష్ రిమూవర్లు ఎక్కువగా వాడటం వల్ల గోళ్ళపై పసుపు మరకలు వస్తాయి. కొన్నాళ్ళు ఈ రంగు మానేయాలి. నిమ్మరసం ,బేకింగ్ పౌడర్ కలిపి గోళ్ళపై రాసి కొద్ది సేపటికి కడిగేస్తే నెమ్మదిగా పసుపు రంగు పోతుంది.గోళ్ళు పెరిగే కొద్దీ గోళ్ళు సహాజమైన పింక్ కలర్ లోకి మారిపోతాయి. ఏ రసాయనం అయినా పదేపదే శరీరంపైన వాడితే సమస్యలు వస్తాయి. గోళ్ళరంగు ఇలాంటిదే కదా.

Leave a comment