ఫిట్ నెస్ కోసం వ్యయామాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటేనే లాభం. ఫిట్ గా ఉండాల్సిన వ్యాయామాల్లో పర్ ఫార్మెన్స్ షూస్ వాడాలి. దీనివల్ల వర్కవుట్స్ లో మంచి ప్రొగ్రెస్ ఉంటుంది. ఇవి ట్రెండీగా బరువు తక్కువ కుషనింగ్ తో ఉంటాయి కనుక సింథటిక్ ట్రాక్,ట్రేడ్ మిల్ తో పాటు బయట రోడ్డు పైన పరిగెత్తేందుకు సౌకర్యంగా ఉంటాయి. వ్యాయామంలో శరీరం నీటిని కోల్పోతుంది.కనుక తప్పకుండా మంచినీళ్ళు శక్తినిచ్చే పానియాలు తాగాలి.వట్టి వ్యాయామంతో సరిపోదు కనుక శరీరానికి ఆరోగ్యవంతమైన పోషణ ఇచ్చే ఆహారాన్ని అందించాలి. ప్రోటీన్స్ శరీరానికి ఎంతో అవసరం.

Leave a comment