Categories
ఇది వరకు జుట్టు నెరిస్తేనే హెయిర్ కలర్. కాని ఇప్పుడు రకరకాల హెయిర్ కలర్స్ ఫ్యాషన్. ఇలాంటి ఫ్యాషన్ ఫాలో అవ్వాలి అనుకుంటే ముందు హెయిర్ థెరపిస్ట్ ను సంప్రదించి కలర్ వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా చివర్లు చిట్లిపోకుండా శ్రద్ద తీసుకోవాలి, సరైన కలర్స్ ఎంచుకోవాలి. వార్మ్ కలర్స్ లో ఎల్లో ,ఆరెంజ్,కాపర్,బ్రిక్ కలర్స్ సూటవుతాయి. బ్లూ, గ్రీన్, పింక్ కూల్ కలర్స్ కేటగిరిలోకి వస్తాయి. కలరింగ్ కంటే ముందు కండిషనింగ్ చేయించుకోవాలి. మొట్టమొదటిసారి జుట్టు రంగుకు దగ్గరగా ఉండే బ్రౌన్ మంచిది. తరచూ రంగులు మారుస్తూ ఉంటే జుట్టు పొడిబారిపోతుంది. హెన్నా అప్లయ్ చేసి వుంటే కలర్ ప్రభావితం అవుతుంది.