ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

Leave a comment