వరస విజయాతో కెరీర్ లో ఉన్నత దశలో ఉంది సమంత .తాజాగా రంగస్థలంలో ఆమె నటన ఆమెకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసింది. ఒక వెబ్ సైట్ కోసం ఇచ్చిన ఇంటార్వ్యూలో సమంత మాట్లాడుతూ నా పెండ్లి తరువాత నా యాంగర్ లెవల్స్ చాలా కంట్రోల్ అయ్యాను .నేను, చే ఎంతో పోట్లాడుకొంటాం కానీ మరుక్షణం ఇద్దరం పక్కనే కూర్చుని ఆ విషయాన్ని గురించి మాట్లాడుకొంటాం .ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని మనసులో తలుచుకొంటాం.  లిమిట్ ఎప్పుడు దాటం అన్నది సమంత. బిజి  షెడ్యూల్స్ మధ్య కూడా ఒక చిన్న ప్రయాణం ,ఇంట్లో జరిగే వేడుకలు ఏవీ మిస్ కాకుండా ఉంటాం. ఒక అందమైన జీవితాన్ని ఇద్దరం ఆస్వాధిస్తున్నాం అన్నది సమంత.

Leave a comment