ఉద్రేకాలు శరీరంపైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు అధ్యయనకారులు.  ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే అకాల మృత్యువువాత పడవలసిందేనని అధ్యయనాలు నిర్ధాక్షిణ్యంగా చెపుతున్నాయి. ముఖ్యంగా పాతీక నుంచి 45 ఏళ్ళ వాళ్లు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవలనీ, అలా కోపం తెచ్చుకొంటే అడ్రినల్ గ్రంధి మామూలు కన్న ఎక్కువ మోతాదులో విడులై డీఎన్ఎను దెబ్బతీసి మల్టిపుల్ స్కెల్ రోసిస్ ప్రాణాంతక వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.  కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, ఒక్కోసారి మనలోపలి ఈ నిస్సహాయతను కోపం రూపంలో వెలిగక్కాక, కోపానికి గురైన వ్యక్తుల కంటే మనమే ఎక్కువ బాధ పడతాము అంటున్నారు ఆధ్యాత్మిక తత్వవేత్తలు.  ఎలాగైనా ఎందుకైనా కోపం తగ్గించుకోవడం మంచిదే.

Leave a comment