ఆఫీస్ పనితో చాలా  ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా టీయూస్కుపోతే నష్టమే అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఆ విసుగు కోపం ఇంటికి వెళ్ళగానే భాగస్వామి పైనో. పిల్లల పైనో వెళ్లగక్కితే ఇంకా ఇంటి వాతావరణం గందరగోళం అయిపోతుంది. అలా ఆఫీస్ సమస్యల్ని ఇంటివరకుతేకుండా చిన్న పరిష్కారం చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. రోజు కనీసం ఐదొందల కేలరీలు ఖర్చు చేసేలా ఎదో ఒక వ్యాయామం చేయగలిగితే ముందుగా మనసులో వత్తిడీ  నిస్పృహ ఉండదంటున్నారు. రోజుకి ఎదో రకంగా పదివేల అడుగులు వేసి వేలకు నిద్ర పోకపోతే మనసు అలజడికి గురికాక తప్పదంటున్నారు. ఆఫీస్ లో వుండే ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కో గలిగే  శక్తి సామర్ధ్యాలు వ్యాయామం యోగా వల్లనే సమకూరుతాయంటున్నారు . ఒకేసారి నడవటం కష్టం అయింది. మధ్యలో బ్రేక్ తీసుకుంటూ అయినా సరే నడవాలి. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వాలి. అలాగే కోపమొచ్చినా అంతే. పని పక్కన బెట్టి కాసేపు బయటకివచ్చి నడవమంటున్నారు.

Leave a comment