దక్షిణ కొరియన్ల మొట్ట మొదటి మహారాణి హర్ వాంగ్ ఓక్ . ఈమెను సురిరత్న అంటారు. ఆవిడ పుట్టినవూరు అయోధ్యట. అందుకే ఏటా వందల కొద్దీ దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తర ప్రదేశ్ లో వున్న అయోధ్యను దర్శించి వెళుతుంటారు. ఈ మహారాణి అయోధ్యలో పుట్టి ఇక్కనుంచి క్రీ. శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియా వెళ్లి దేవుడు చెప్పిన ప్రకారం అక్కడున్న సురో ని పెళ్లాడిందట. పది మంది పిలల్లకు జన్మ ఇచ్చింది. అక్కడ గామ్ వాన్ గయ  అనే రాజ్యాన్ని స్థాపించిందట. ఈమె ద్వారానే కరర్  తెగ అయోధ్యలో తన సంస్కృతి ఉట్టిపడేలా తమ రాణీ గుర్తుగా ఒక ఆలయం నిర్మించామని అడిగారట. ఇప్పుడు అయోధ్యలో రాణీ గుడి వస్తుందన్నమాట.

Leave a comment