కొర్రల్లో తక్కువ కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా పీచు ఉండటంతో శరీరంలోకి తేలిగ్గా ఇంకిపోయి చక్కెర విడుదలని తగ్గిస్తాయి.డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు కొర్రలు వాడటం మంచిది కూడ. వీటిలో కొవ్వులు చాలా తక్కువ. రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.శరీర బరువును తగ్గిస్తాయి.కొర్రలలో ఉండే అమినో యాసిడ్స్ చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి.పాలిచ్చే తల్లులు వీటిని భోజనంలో భాగం చేసుకుంటె పాలు ఎక్కువ పడతాయి.ఫాస్పరస్,పోటాషియం,ఐరన్,జింక్ అధికంగా కొర్రల్లో ఉండటం కారణంగా ఇవి ఎముకలను బలంగా చేసి జుట్టు,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Leave a comment