ఓం నమశ్శివాయ

కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం ఈ    రోజు.సోమవారం రావటంతో మరీ విశేషం.శివయ్యకి ఇష్టమైన రోజు మరి ఉపవాసం ఉండి దైవ ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం.కార్తీక మాసంలో అందరూ కలిసి వన భోజనం చేయడం,మహాశివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
ఈ రోజంతా శివనామ స్మరణతో తరించిపోవాలి..ఉదయం,సాయంత్రం శివాలయం దర్శనం చేసుకోవాలి.కార్తీక మాసంలో శివాలయాలు చాలా రద్దీగా ఉంటాయి.పంచామృత అభిషేకం,పండ్ల రసంతో అభిషేకించిన భోళాశంకరుడికి  పరమానందం.
నిత్య ప్రసాదం:  కొబ్బరి,పండ్లు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment