ఆర్తీ డోగ్రా మూడు అడుగుల రెండు అంగుణాలు  ఎత్తు వుంటారు. కోట్లాది మందికి స్ఫూర్తి దాత కలెక్టర్ కావాలని సంకల్పించకున్నారు ఆర్తీ సివిల్స్ రాసి మొదటిప్రయత్నం లోనే 59 వ ర్యాంక్ సాధించారు. కొన్నాళ్లు అజ్మీర్ కలెక్టర్ గా పని చేశారు. తరువాత జోధ్ పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కీలకమైన పదవులు చేపట్టారు సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు గాను రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.  దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దివ్యంగ్  రధాల   హక్కు పేరుతో 874 చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. 17000 మంది దివ్యాంగులు తమ ఓటు హక్కు ని వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు బికానెర్ జిల్లా మెజిస్ట్రేట్ ‘బుంకో బినవో ‘అని ప్రచారం చేసి బహిరంగ విసర్జనకు అడ్డుకట్ట వేశారు.

Leave a comment