మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది వరల్డ్ అసోసియేషన్ పురస్కారం అందుకుంది సారా టొల్చి. సారా చేతులు లేకుండా పుట్టింది మొదటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్ళతోనే బొమ్మలు గీస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తుంది సారా. బెల్జియంకు చెందిన సారా ఇక్కడి బ్రస్సెల్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ లో తన పెయింటింగ్స్ ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వివాహమై ఒక పాపకు తల్లి అయిన సారా తన దైనందిన జీవితాన్ని వీడియోలుగా తీసి యూట్యూబ్ లో పెట్టింది ఈమె యూట్యూబ్ ఛానల్ కు కోట్లలోనే వీక్షకులున్నారు.

Leave a comment