యోగా సిడి లలో సినిమా నటి కంటే ఎక్కువ పాప్యులారిటీ సంపాదించింది శిల్పాశెట్టి. వ్యాయామ విసేషాలలో శిల్పా శెట్టి చానల్ విజయవంతంగా యూట్యూబ్ లో నడుస్తుంది. 2015 నుంచి రచయిత్రిగా ఆరోగ్యానికి శారీరక సౌష్టవానికి అవసరమైన పోషకాహారం గురించి రాస్తోంది శిల్పాశెట్టి. ఆ వ్యాసాలన్నీ ది గ్రేట్ ఇండియన్ డైట్ పేరుతో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పుస్తకంగా తెచ్చింది. అమెజాన్ లో ఎక్కువగా అమ్ముడైన ఆరోగ్య చిట్కాలు పుస్తకం ఇదే. ఇప్పుడో కొత్త పుస్తకం పూర్తి చేసింది శిల్పా శెట్టి. ‘ది డైరీ ఆఫ్ ఎ డొమెస్టిక్ దివా’ లో 50 వంటల రకాలున్నాయి. పెంగ్విన్ అచ్చువేస్తున్న ఈ పుస్తకం త్వరలోనే వస్తుంది. బహుముఖ ప్రజ్ఞ అంటే ఇదే.

Leave a comment