నీహారికా,

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఊరు ముస్తాబు అవ్వుతుంది. కోటి ఆశలతో స్వాగతిస్తుంది. కాలం ప్రవహించే ఒక నదీ ప్రవాహం. కనురెప్పల కింద అందమైన స్వప్నం. ఎప్పుడూ భవిష్యత్తు ఊరిస్తూనే వుంటుంది. రేపు మనకోసం ఒక అద్భుతమిన బహుమతి ఇవ్వబోతుండానే ఒక సహజమైన ఆశ. ఆ రాబోయే రేపుని అలంకరిస్తునే వుంటుంది. కాలం కదలిపోతూ నిన్న నేడుగా , నేడు రేపుగా మారుతూనే వుంటుంది. కాలం పుటల్లోకి జారిపోతున్న 2017 కు వీడ్కోలు పలుకుతూ 2018 కి ఆహ్వానం పలుకుతూ రేపటి ఆశల హరివిల్లుని సృష్టించుకుంటున్నాం. ఆ కొత్త సంవత్సరం మన కోసం ఏం దాచి తెస్తుంది? ఇంకొన్ని కమ్మని కళలు, ఆంక్షలు, దీవెనలు, మంచి రోజులని అపురూపంగా ఇవ్వబోతుంది. గడిచిపోయినా సంవత్సరాన్ని తీపి గుర్తుగా మిగుల్చుకుని, రేపటి కొత్త సంవత్సరానని ఆహ్వానించడం సాంప్రదాయం. చీకటిని చీల్చుకుంటూ వేలుగోచ్చినట్లు కొత్త సంవత్సరం వస్తుంది. అందరికీ శుభాకాంక్షలు.

Leave a comment