ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు ఎప్పుడు కొత్తదనంతో ఉండాలన్నా ఫ్రెష్నెస్ తో శుబ్రంగా వుండాలన్నా కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు స్కూల్ కు వెళ్ళే పిల్లల నీళ్ళ సీసాలు వాసన వస్తు ఉంటాయి. రెండు స్పూన్లు వంట షోడా గోరు వెచ్చని నీళ్ళు పోసి గంట సేపు అలా వదిలేసి శుబ్రం చేస్తే వాసన పోతాయి ఇంట్లో డేకోరేషన్ కోసం ఎన్నూ ఇత్తడి ఆర్టికల్స్ పెడతారు. అలాగే నీళ్ళు నింపి పువ్వులు వేసే ఇత్తడి పళ్ళాలు కుడా ఉంటాయి. ఇవి మురికి పట్టినా రంగు మారినా అమోనియాతో ముంచిన గుడ్డతో కానీ మెత్తని బ్రష్ తో కానీ తగిపితే కొత్తవిలా వుంటాయి. అలాగే అడ్డం పైన మరకలు లేకుండా వుండాలంటే స్పూన్ పౌడర్ ను నీళ్ళతో తడిపి తుడిస్తే పోతాయి. స్టీల్ డబ్బాలు, నీళ్ళ బాటిల్స్ కుడా , వెనిగర్ కలిపిన నీళ్ళతో శుబ్రం చేస్తే ముతక వాసన లేకుండా ఉంటాయి.
Categories