పిల్లలు బ్యాగుల్లో తప్పని సరిగా వాటర్ బాటిల్ ఉంచాలి. కొద్ది రోజులకే ఏ పువ్వులో ముద్రించిన ఆ బాటిల్స్ మురిగ్గా కనిపిస్తాయి. గోధుమ రంగులోకి దిగిపోతాయి. వీటిని కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే కొత్తవిలా అయిపోతాయి. బాటిల్ పైన డిష్ వాషర్ సెఫ్ సింబల్ వుంటే ఆ బాతిల్లను డిష్ వాషర్ తో శుబ్రం చేయవచ్చు లేకపోతె పాత్రలు తోమెందుకు వాడే లిక్విడ్ లో కాసిన్ని వేడి నీళ్ళు కలిపి బాటిల్లో పోసి ముతా బిగించి కాసేపు ఆగీ బాగా మెదిపి ఆ నీళ్ళు వంచేసి చుస్తే బాటిల్ శుబ్రంగా వుంటుంది. ఇలా చేసినా నీట్ గా కనిపించక పొతే వైట్ వెనిగర్ కలిపిన నీళ్ళు పోసి ఆ బాటిల్ ను నాలుగైదు గంటలు వదిలేసి ఆ తర్వాత శుబ్రం చేస్తే చక్కగా కొత్తవిగా ఉంటాయి.

Leave a comment