ఎవరు కోటీశ్వరి కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది కౌశల్య కార్తీక. మొట్ట మొదటి స్పెషల్లీ ఛాలెంజెడ్ మహిళ కంటెస్టెంట్. మాట్లాడలేని,వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌ ప్లస్‌ టూ వరకు నాగర్‌ కోయిల్‌ లోని బదిరుల పాఠశాలలో చదివిన  కౌశల్య ఎంబిఏలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌. తమిళనాడులోని మదురైలో జన్మించిన కౌశల్య సినీనటి రాధిక నిర్వహిస్తున్న షో లో పాల్గొని రాధిక అడిగిన ప్రశ్నలు లిప్ రీడింగ్ ద్వారా అర్ధం చేసుకొని సమాధానాలు అందించింది తమిళం మాతృభాష కావటంతో ఇంటర్ లో చేరే వరకు ఆమెకు ఇంగ్లీష్ అవసరం రాలేదు. కనీసం ఎబిసిడిలు కూడా రావు. మదురై కళాశాలలో చేరి అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొంది. ఆమెను విద్యార్ధులందరు ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవచ్చు.

Leave a comment