ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నేతి లోని ఫ్యాటీ యాసిడ్ పేగుల్లోని కణాలకు తగిన పోషకాలు అందించి త్వరగా జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. కడుపునొప్పి మంట  తగ్గిస్తుంది. ఆహారానికి అద్భుతమైన రుచి ఇస్తుంది, ముఖంగా శీతాకాలంలో నెయ్యిని తగుమాత్రంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.

Leave a comment