కొవ్వు అన్న పదం వింటేనే సాధారణంగా కంగారుపడిపోతుంటాం. కానీ అన్ని ఫ్యాట్లు చెడ్డని కావు. కొన్ని శరీరానికి చాలా అవసరం. పూర్తిస్థాయి ఆరోగ్యం కోసం ఫ్యాట్స్ అవసరం అంటారు డాక్టర్లు. మెనో ఆన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (MUFA ) ఒమేగా 3 లు గొప్ప ఎనర్జీ ఆధారాలు.అత్యవసర విటమిన్లు పోషకాలను శరీరం గ్రహించటానికి ఇవి సహకరిస్తాయి. ఇవే బరువు తగ్గటానికి సహకరించి గుండెకు ఆరోగ్యంగా ఉంచుతాయి. చేదు ఫ్యాట్స్ అంటే సాచ్యురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను రక్తం స్థాయిల్లో పెంచుతాయి. దీనివల్ల ఆర్టరీలు క్లాగ్  అవుతాయి . కరోనరీ సమస్యలు తలెత్తుతాయి. మంచి ఫ్యాట్స్ నుంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందటం కోసం ఆలివ్ ఆయిల్ ఫ్యాటీ ఫిష్ అవకాడొలు నట్స్ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

Leave a comment