అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది. ఓ సారి బండి పైనుంచి పడి, ఇంకో ప్రమాదంలో మోచేతికి గాయమై ఈ విలు విద్య క్రీడకు దూరమైంది. కానీ ఇప్పుడు సినీ రంగoలో బిజీ అయ్యాక కుదన్ అనన్య కు విలువిద్య పైనున్న ఇష్టం తగ్గలేదు. ఎర్నాకులం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి దిగింది. మహిళల రిజర్వ్ విభాగంలో మరో బంగారు పతకం సాధించి నేషనల్ ఛాంపియన్ షిప్ కు అర్హత పొందింది. దీపికా కుమారి వంటి ఒలింపిక్ ఛాంపియన్స్ తో పోటీ పడటం విశేషం. ఫోటో షూట్స్ లో కనిపించే ఈ అమ్మాయి స్పోర్ట్స్ పేజీలో కనిపించడం విశేషం. అనన్య అసలు పేరు అయిల్య గోపాలకృష్ణన్ నాయర్.

Leave a comment