ఇల్లే కదా స్వర్గ సీమ అంటుంటారు గానీ ఆ ఇల్లు శుబ్రంగా ఉంచుకోకపొతే మాత్రం నరకమే. ఇంటిని ఎంతగా క్లీన్ చేస్తే క్రిమికీటకాలకు అంతగా దూరంగా ఉండచ్చు. చేసేందుకు చిన్నగా ఉంటాయి కానీ క్రిముల వల్ల ఆరోగ్యానికి సమస్యే. ప్రతి సారీ భోజనం అయినా వెంటనే ఆ ప్రదేశం శుబ్రం చేయాలి. ఎంగిలి పాత్రలు సింక్ లో వదిలేయకుండా శుబ్రం చేయాలి. లేదా బయట ఉంచేయాలి. అలగ్ పచ్చదనం వుంటే ఇంటికి మంచిది అంటాం కానీ పూల కుండీలు, పచ్చని చెట్ల వల్ల దోమలు గుడ్లు పెడతాయి. మొక్కల పెరుగుదల కోసం వేసే ఉల్లిపాయ తొక్కలు కూరగాయల తొక్కలు టీ పొడి వల్ల మొక్కలకు బలం సంగతి ఎలా వున్నా ముందర పురుగులు మాత్రం చేరిపోతాయి. అలాగే ఇంటి గోడలు నీలింగ్, ఫ్లోర్ లలో పగుళ్ళు చూపితే వెంటనే నీల్ చేయాలి ఈ సందుల్లో కుడా క్రీములు చేరుతాయి.

Leave a comment