
ఇందులో 41 మంది నటుల జీవితాలున్నాయి ఒక్కళ్ళ గురించి చెపుతూ వుంటే అసలు ఎరి కోరి వీళ్ళ సాలెగూట్లోకి వచ్చారు. శ్లేష్మం లో ఈగల్లాగా ఇందులోంచి ఎందుకు బయటకు రాలేక పోయారు అనిపిస్తోంది. ఏళ్ళ తరబడి ఒక అవకాశం కోసం తపించి,వయసయ్యాక అటూ ఇటూ చూస్తే ఇంకో గమ్యం కనిపించకో కష్టమైన,సుఖమైనా,ఇప్పటివరకు నడిచిన దారివెంట నడవక పోతే ఇంకో అవకాశం లేదు. కృష్ణ నగర్ లో కనిపించిన అందరు ఇలాంటి వాళ్ళే. అందులో ఒక మహేష్ యాదవ్ అంటాడు . మా నాన్న చనిపోయాడు నేను గాయం షూటింగ్ లో ఉన్నా నాకు కబురు చెప్పేవాళ్ళు లేరు. నాకు ఫోన్ లేదు ఏ సాయంత్రానికో షూటింగ్ గేప్ లో నా స్నేహితుడు వచ్చి చెబితే తెలిసింది అప్పుడు పరుగెత్తుకు పోయాను చనిపోయిన మా నాన్న కోసం,ఆ అనుభవంతో ఆరు నెలలు సినిమా వైపు చూడలేదు . ఇలాటి వేదన పూరితమైన గాధలు కృష్ణనగర్ కథల్లో కనిపిస్తాయి. ఇలాటి చీకటి దారుల్ని పరిచయం చేసిన బత్తుల ప్రసాద్ అభినందనీయుడు ఇంకా ఇలాటి పుస్తకాలు ఎన్నో రావాలని ఆకాక్షిద్దాం.