భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్‌ పురష్కారం 2017 వ సంవత్సరానికి కృష్ణా సోబ్తి అందుకున్నారు.  కృష్ణ సోబ్తి   1925లో నాటి అవిభక్త   పంజాబ్‌లోని గుజరాత్  అనే నగరంలో ఫిబ్రవరి 18వ తేదిన జన్మించారు.   ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది.   హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్‌’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.   ‘యాదోంకెయార్‌’ ,’తిన్‌ పహార్‌’, ‘ఎ లడ్‌ కీ’ ఎంతో పేరు తెచ్చిన నవలలు.   1979లో తన తొలి రచన ‘జిందగీనామా’ కు పొడిగింపుగా ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ పేరిట ఇంకా చిన్న నవల రాసి ఈ రెండు కలిసి ‘జిందారుఖ్‌’ గా ప్రకటించారు. ఈ నవలకు జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చింది.

Leave a comment