పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు అవి విగ్గులు, సవరలు కావు సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు సన్నని హెయిర్ బాండ్స్ కి అతికించిన అందమైన హెయిర్ స్టైల్స్ ఆ బాండ్ తలలో పెట్టుకుంటే చాలు. దానికి అతికించిన పొట్టి జుట్టుతో వత్తుగా కాస్త పొడుగాటి జుట్టు తో పొడుగ్గా, క్షణాల్లో మార్చేయవచ్చు. పొడవాటి పొనీ వేసుకోవాలంటే రెడీ మేడ్ పొనీలున్నాయి. వీటికి అతికించిన రిబ్బన్ ని అసలు జుట్టుకు ముడేస్తే పొడుగాటి పోనీ వస్తుంది. బంగారు రంగు జుట్టు కావాలంటే ఇంతే ఈ సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్ తో ఏదైనా సులభమే.ఈ కృత్రిమ వెంట్రుకలు కుడా చూసేందుకు చాలా సహజంగా జుట్టు తో కలిసిపోతాయి. ఎటొచ్చి మన జుట్టు లాంటివే చూసి ఎంపిక చేసుకోవాలి.

Leave a comment