పండగ కోసం, లేదా ప్రత్యేక సందర్భాలలో ఇంటికి వేడుకల అందాన్ని ఇచ్చేందుకు వాకిల్లో రంగుల ముగ్గులు పెడతారు. దానికి సమయం ఓపిక కావాలి ఇవేవీ అవసరం లేకుండా రంగోలి క్షణాల్లో పెట్టేయాలంటే మెటల్ రంగోలి ఎంచుకోవాలి. రంగురంగుల రకరకాల డిజైన్ లలో మెటల్ ముగ్గులు తీగలు నెమళ్ళతో చూడముచ్చటగా ఉంటాయి. వీటిని ఇంటి వాకిళ్ళలో పెట్టుకొని వేడుక అయిపోయాక తీసి దాచుకోవచ్చు. ఆన్ లైన్ ఎన్నో డిజైన్లలో కనిపించే మెటల్ ముగ్గుల్ని ఎంచుకుని ఆర్డర్ ఇస్తే ఎంచక్కా ఇంటికి వచ్చేస్తాయి.

Leave a comment