వేసుకొన్న దుస్తులకు తగ్గట్లు గోళ్ళ రంగు మార్చుకొంటు ఉంటారు అమ్మాయిలు. ప్రతి సారి రసాయనాలతో కూడిన నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తే గోళ్ళరంగు మరి పాడైపోతాయి. పైగా ఘాటైన వాసన ఒక పట్టాన వదలకుండ ఇబ్బంది పెడుతో ఉంటుంది. ఇంట్లోనే రసాయనాలు లేని నెయిల్ పాలిష్ రిమూవర్ ని తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ ఉంటేచాలు నెయిల్ పాలిష్ తుడుచేసుకోవచ్చు. ఒ చిన్న గిన్నెలో నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ పోసి గోళ్ళను ఆ గిన్నెలో ముంచి నిముషం తరువాత రుదితే క్లీన్ చేస్తే నెయిల్ పాలిష్ మాయమవుతోంది . గోళ్ళు మెరవాలంటే ఇందులో కాస్త ఆల్కహాల్ కలిపితే చాలు.

Leave a comment