ఈనెలలో ప్రయాగ్ రాజ్ అలహబాద్ లోని అర్ధకుంభమేళా జరుగనుంది. మూడు నదుల సంగమంలో మూడు మునకలు వేసేందుకు ,పితృతర్పణాలు వదిలేందుకు జనం పొటేత్తుతారు. ఇటు భక్తుల,అటు విదేశీ పర్యాటకులు కూడా వచ్చే ఈ కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ భాగాస్వామ్యంతో 100 హెక్టార్ల విస్తీర్ణంలో టెంట్ సిటీ నిర్మించింది. ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ,బెడ్ రూమ్ లు,లివింగ్ రూమ్లు ఉంటాయట. ఈ టెంట్ ల్లో అటాచ్ బాత్ రూమ్ ,వైఫై ,ఆర్డర్ పైన భోజనాలు అమర్చే పనివాళ్ళు ఉంటారు. అద్దె రోజుకి రెండు నుంచి మూడు వేలు. ఆన్ లైన్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు.

Leave a comment