కథక్ నృత్యానికి పర్యాయపదం కుముదిని లిఖియా జీవితం మొత్తం నేర్చుకోవటం.అన్వేషించటం,బోధించటం సృష్టించడం కోసం అంకితం చేసిన కుముదిని కి ఇప్పుడు 90 ఏళ్లు.సనాతన సంప్రదాయ రీతిలో కథక్ నేర్చుకున్నారు.ఎన్నో కొత్త ప్రయోగాలు కథక్ కళ ద్వారా  సృష్టించారు  కుముదిని పెర్ఫార్మర్ గా,కొరియోగ్రాఫర్ గా ప్రపంచమంతా పర్యటించారు భారతీయ నృత్యానికి సంగీతానికి కేంద్ర బిందువుగా కదంబ్   పాఠశాలను నెలకొల్పారు.ఆమె కొరియోగ్రఫీ చేసిన ఉమ్రావ్ జాన్ సినిమా హిట్.ప్రసిద్ధి నటులు రేఖ , జయప్రదకు  కథక్ నేర్పించారు ప్రస్తుత పరిస్థితిని గురించి చెపుతూ, కరోనా గురించే కాదు జీవితంలో దేనికీ  భయపడవలసిన అవసరం లేదన్నారు.ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించటం నేర్చుకోవాలి అంటారు కుముదిని లఖియా .

Leave a comment