కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో కొత్త చీరలు ఉతికితే రంగుపోదు ,కొత్తదనం కూడా పోదు. అలాగే కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ ను కలిపి ఇందులో కాస్త యూకలిఫ్టస్ ఆయిల్ కలిపి బాత్ రూమ్ క్లీన్ చేస్తే నేల గోడలు కూడా క్లీన్ గా అయిపోతాయి. కుంకుడు రసంతో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి గూడాల వారగా చల్లితే దోమలు ఈగల బెడద వుండదు. పోనీ కుంకుడు కాయలు ఇలాగైనా సద్వినియోగం చేయచ్చు.
Categories
WoW

కుంకుడు కాయతో ఎన్నో ఉపయోగాలు

Leave a comment