కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్  చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఎన్నో రకాల కాన్సర్ లను తగ్గించేందుకు కీరా సహాయపడుతుందని వాడియా పరిశోధనలు చెపుతున్నాయి. కీరా దోస పల్చని ముక్కను నాలుకతో మొటిలోని అంగిలికి తగిలేట్టు 30 సెకన్లు నొక్కిపెడితే చాలు అందులోని ఫైటో కెమికల్స్ నోటి దుర్వాసనను కారణం అయ్యే బ్యాక్తీరియా ను చంపేస్తాయి. ఎక్కువ నీరు తక్కువ క్యాలరీలు వుండే కీరా దోస బరువు తగ్గించేందుకు చాలా సహాయపడతాయి, ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను  మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం రెండు తమాషా ఉపయోగాలున్నాయి. స్నానాల గదిలో అద్దని కీరముక్కలతో రుద్దితే  వేడి నీటి వల్ల  అడ్డం పై ఆవిరి ఏర్పడదు. అదే తలుపులు శబ్దం చేస్తుంటే కీరా ముక్క రుద్దితే శబ్దం పోతుంది.

Leave a comment