కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120 క్యాలరీలు ఉంటే అవి ఉడికిస్తే 230 క్యాలరీలు అవుతాయి. ఈ తేడాలను గుర్తించి వాడమంటున్నారు. పచ్చి కూరల్లో అధిక శాతం నీరుంటుంది. వాటని ఉడికిస్తే నీరు ఆవిరై క్షణాల్లో పోషకాలు విడుదల కావటం మూలంగా క్యాలరీల శాతం పెరుగుతుంది. టమాటో క్యారెట్ దుంపలు ఇవన్నీ ఈ కోవాకే వస్తాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్ పచ్చిగా తింటే శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీన్ని ఉడికిస్తే పాలీ ఫెనాల్స్ సి విటమిన్ విచ్చిన్నం అవుతాయి. కనుక కొన్నిసార్లు ఉడికించి కొన్నిసార్లు పచ్చివీ తినాలి. అలాగే బ్రొకోలీ కాలీ ఫ్లవర్ లు మైరోసిసెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఉడికిస్తే ఔషధ గుణాలు పోతాయి. అయితే ఇవి ఉడికిస్తే కాన్సర్ ను నిరోధించే ఇండోల్ అనే రసాయన పదార్ధం దొరుకుతుంది. ఇవి కొన్ని సార్లు ఉడికించకుండా సలాడ్స్ లాగా ఉడికించి కూరేలాగా తింటే మంచిది. వండే పద్ధతులు కూడా కూరగాయల్లో పోషకాలు స్థాయిని ప్రభావితం చేస్తాయి.
Categories