విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి. అంటే ఒక సమాధానం రెండు పరికరాలొచ్చాయి. అవి fat  magnet  gravy  seperator  కూర వండేశాక దానిపై ఫ్యాట్ మ్యాగ్నెట్స్ పెట్టి బటన్ నొక్కితే కూరలో అధికంగా ఉండే నూనె తీసేస్తుంది.అంటే ఎక్కువగా వుండే నూనె బయటకి వచ్చేస్తుంది కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. అధికమైన బరువుండి  ఇక నూనెతో చేసిన కూరలు తినలేం అని నోరు కట్టేసుకునే వాళ్లకి  ఈ ఫ్యాట్ మ్యాగ్నెట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక గ్రేవీ సెపెరేటర్ అయితే గ్రేవీ లో అధికంగా ఉన్న నూనెను తేలిగ్గా వేరుచేస్తుంది. కూర గిన్నెలోంచి ఎంత బాగా వంచిన నూనె పూర్తిగా తీసివేయలేం. కానీ గ్రేవీ  సెపెరేటర్ లో గ్రేవీ మొత్తం పోస్ట్ నూనె పైకి తేలుతుంది . దీంతో వుండే పైపు ద్వారా దేన్నీ తేలిగ్గా తీసేయచ్చు. మిగిలిన గ్రేవీ కూరల్లో వాడుకోవచ్చు. మాడిపోయిన పోపు దినుసులు ఫిల్టర్ చేసేలా దీనికో జాలీ కూడా వుంది. కూర రుచిగా వండుకునేందుకు కాస్త నూనె ఎక్కువ వేసి దీన్ని పూర్తిగా పిండేయచ్చు ఈ రెండు పరికరాలతో.

Leave a comment