శరీరానికి మూవ్ మెంట్ ఉంటేనే ఆరోగ్యం. గంటల కొద్దీ కదలకుండా కుర్చుని పని చేసే వాళ్ళు, కుర్చీలో కూర్చునే బదులు వ్యాయామం కోసం ఉపయోగించే బంతి పైన కూర్చోండి, ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. బంతి పైన కూర్చుంటే వెన్ను పైన వత్తిడి పడదు. నడుము, వెన్ను నొప్పి బాధించదు. బంతి పైన కుర్చుని పని చేస్తే శరీరాన్ని బంతి సమన్మయం చేస్తుంది. అటూ, ఇటు కదలొచ్చు. దీని వల్ల కెలరీలు కర్చు అవ్వుతాయి. గంటల కొద్ది కూర్చున్నా ఇబ్బందేం వుండదు. బంతి పైన కూర్చున్నప్పుడు కదిలే అవకాశం ఉన్నందున, బాలన్స్ చేస్తారు కనుక రక్త ప్రసరణ బావుంటుంది. అవయువాల పనితీరు పైన ప్రభావం వుండదు. మధ్య మధ్య బంతి పైన వర్కవుట్స్ చేయొచ్చు. వున్న చోటు నుంచి కదలకుండా ఇటు శ్రద్దగా పని చేసుకోవచ్చు, వ్యాయామం చేయచ్చు. ఇంట్లోనుంచి వర్క్ చేసే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు.

Leave a comment