నగలు ,వస్త్రదుకాణాల్లో సేల్స్ గర్ల్స్ గా పని చేసే అమ్మాయి ,పన్నెండు గంటల పాటు నిలబడే పని చేస్తూ ఇప్పటివరకు నానా కష్టాలు పడ్డవారికి కేరళ ప్రభుత్వం కూర్చునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వాళ్లు వాష్ రూమ్ కి రెండు సార్లు మాత్రమే వెళ్ళాలి, భోజన విరామం అరగంట కింద నేలపై కూర్చున్న కాళ్ళు నొప్పెట్టి చేరగిలపడినా జీతంకోత విధించేవాళ్ళు. విజిపెన్ కూట్ అనే మహిళ ఎనిమిదేళ్ళు పోరాటం చేస్తే పని చేసే ఆడవాళ్ళకి బాత్ రూమ్ కు వెళ్ళేందుకు ,రెండు నిమిషాలు కూర్చునేందుకు ఒక స్టూల్ గానీ కుర్చీగానీ యాజమాన్యం ఇవ్వాలని గవర్నమెంట్ తాజా నిర్ణయం తీసుకొంది.

Leave a comment