మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, దురద సమస్యలు పోయి జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. గుడ్డు తెల్ల సోనలో తగినంత పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే అది చెక్కని హెయిర్ కండిషనర్ లా పని చేస్తుంది. వేప నూనె ను కుదుళ్ళకు పట్టించాలి. అలాగే వేపాకులు వేసి కాచిన నీళ్ళతో తలంటు స్నానం చేయాలి. ఉల్లిపాయ రసం కుదుళ్ళకు పట్టించి రెండు గంటల పాటు ఆగి స్నానం చేసేయాలి. వారంలో మూడు రోజులైనా కొబ్బరి, ఉసిరి, ఆలివ్ నూనెలతో తలకు మసాజ్ చేసుకుంటే చెక్కని జుట్టు సొంతమవుతుంది.

 

 

Leave a comment