ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్ అన్న పుస్తకంలో ఈ లేఖ అచ్చయిది 13వ ఏటనే తండ్రిని పోగొట్టుకొన్న చందా కొబ్బరి తన తల్లి ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఈదడం నేర్చుకున్నారు. ఈ ఉత్తరంలో కొబ్బరి తన కూతురు ఆర్తికి కేవలం వర్కింగ్ ఉమెన్ గా వుంటే సరిపోదు కుటుంబ బాధ్యతల్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెపుతారు. ‘నీ కుటుంబానికి ఏం కావలో మవు సమకూరుస్తు పొతే నీకేం కావాలో నీ కుటుంబం సమకూరుస్తు వస్తారంటారు. “నేను నాకెరీర్ లో తలమునకలుగా వున్నా. మీ నాన్న నా పైన చిన్ని ఫిర్యాదు కూడా లేకుండా చేశానన్నారు. నువ్వు కుడా నాలాగే జీవితంలో అన్ని క్లిష్టమైన సమయాల్లోనూ జీవిత భాగస్వామి తో సర్వమైన బంధాల్ని కొనసాగించాలి అంటే వృత్తిని కుటుంబాన్ని సమర్ధంగా నడిపిస్తానని నమ్ముతున్నానన్నారు. మన జీవితాలను నిలబెట్టడంలో కఠోర శ్రమ పాత్ర కీలకం, మనం నిర్ణయించుకునే దారిని మనమే ఏర్పరుచుకోవాలి. జీవితం మనపదీ ఇవ్వదు. మనం కష్ట పది నిర్మించుకున్నదే అన్నారామె. ఒక తెలివైన సమర్దురాలైన తల్లి రాసే లేఖ ఇంకోలావుండే అవకాశమే లేదు. ఈ లేఖ ఇవ్వాల్టి అమ్మాయిల కోసమే కదా.
Categories