Warsaw కు చెందిన కళాకారిణి నెస్పూన్ (Nespoon) తన అద్భుతమైన ప్రతిభతో ఉత్తర ఫ్రాన్స్ లోని కాలాయిస్ నగరంలోని ఫ్రెంచి మ్యూజియం ఆఫ్ ఫ్యాషన్ అండ్ లేస్ ను ఒక లేస్ డిజైన్ తో స్ప్రే చేసింది.మ్యూజియం గోడలపైన తీర్చి దిద్దిన ఈ డిజైన్ కోసం అదే మ్యూజియం లో తాను చూసిన 1894 నాటి వస్త్రాన్ని డిజైన్ నమూనాగా తీసుకుంది.ఒకప్పుడు ఈ కాలాయిస్ (Calais) నగరం, లేస్ తయారీ దారులకు పుట్టినిల్లుగా ఉండేది .40 వేల మంది నిర్వాసితులు ఇక్కడే లేస్ తయారీ వృత్తిలో ఉండేవారు.అలనాటి కళాకారులు సృష్టించిన అద్భుతమైన పనితనం ఈ మ్యూజియం లో చూడవచ్చు ఆర్టిస్ట్ నెస్పూన్ మ్యూజియం పైన లేస్ గోడలను అలంకరించింది.