అందమైన చీరె నగలతో పాటు శిరోజాలంకరణ కూడా చాలా ముఖ్యం . వేడుకల్లో మెరిసేందుకు సైగ చుట్టుకోవటం ముఖ్యం అంటున్నారు . హెయిర్ స్టయిలిస్ట్ లు . పూర్వం రోజుల్లో ముచ్చటైన ముడి తో అలంకరించు కొనేందుకు నాగ హారం సూర్య చంద్రులు ,చామంతి బిళ్ళలూ వంటి కేశభరణాలు ఉండేవి . ఇప్పుడు చక్కని ముడుల కోసం అందమైన నగలున్నాయి . రైన్ స్టోన్స్ క్రిష్టల్స్ రత్నాలతో చేసిన బుట్టలు ముత్యాల వరసల్ని ముడులకు అలంకరిస్తున్నారు . కుందన కారి,మీనాకారి వంటి సంప్రదాయ డిజైన్ల ఆభరణాలున్నాయి . చెంప సవరాలను పోలినట్లు ఉన్నా రాజస్థానీ ఆభరణాలు కూడా ముడులకు అందిస్తున్నాయి . ఈ సైగల్లోనూ స్వెప్ట్ బ్యాక్,పఫడ్ ఆఫ్ కాస్ కేడ్ ,రింగ్ లెట్ ,కొనట్ వంటి ఎన్నో స్టయిల్స్ ఉన్నాయి .

Leave a comment