ముద్ర వీడియోస్ పేరుతో గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన రమ మూడేళ్లలో 1200 వీడియోలు పోస్ట్ చేసి 13 కోట్ల మంది వ్యూవర్స్ ని సంపాదించుకున్నారు. బ్లౌజులు డ్రెస్ లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టా లో బేసిక్స్ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో పాఠాలు చెబుతూ ఆమె వారానికి ఒక సారి లైవ్ జూమ్ క్లాస్ లు కూడా నిర్వహిస్తారు. ఈమె వీడియోలు వెస్టిండీస్, కెనడా, యూ.ఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా పాపులర్.ఏడున్నర లక్షల మంది సబ్ స్క్రైబ్ర్లు గల ఈ ముద్ర వీడియోస్ లో ఎంతో మంది టైలరింగ్ లో నిష్ణాతులయ్యారు.

Leave a comment