నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ ఆశ్చర్యమే. ఇదంతా చూసి బాలీవుడ్ జనం ఆశ్చర్యపోతుంటే ఇటు దక్షిణాదిన మన సినీ కళాభిమానులు మాత్రం బోలెడంత కోపం తెచ్చేసుకొంటున్నారు. హీరోయిన్లు సరే వస్తున్నారు, కారక్టర్ పాత్రలు కూడా వాళ్ళే వేస్తే మరి మన వాళ్ళ సంగతేమిటని వీళ్ళ ప్రశ్న. ఈ మనోభావాలతో నిమిత్తం లేకుండా కాజోల్ మాత్రం విలన్ గా రాబోతుందని సమాచారం.

Leave a comment