అమ్మకు ఎన్నో పనులుంటాయి. మరి పాపాయి కూడా అమ్మనే  జో కొట్టమంటుంది.  నిద్రపుచ్చమంటుంది.  అమ్మకు ఈ సమయంలో సాయం చేస్తోంది  ‘స్నూ స్మార్ట్‌ స్లీపర్‌’ . బుట్టలాంటి  ఈ ఊయల్లో  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులలో  బిడ్డని చుట్టి  ఊయల్లో ఉంచి చిన్న బటన్‌  నొక్కితే  చాలు.  పాపాయి ఏడుపు ఆపేంతవరకు అమ్మ చేతుల్లో పెట్టి ఊపినట్లు ఊపుతోంది.  ఏడుపు పెంచితే ఇంకాస్తా జో కొట్టినట్లు ఉంటుంది.  ఇక పాపాయి నిద్ర పోయాక నిద్ర మధ్యలో కదిలి ఏడ్చినా వెంటనే స్పందిస్తూ  జో కోడుతుంది. మరీ పాపాయి ఆపకపోతే ఆప్ ద్వారా అమ్మకి  ఆ విషయం చేరేస్తుంది. పుట్టింది మొదలు ఆరు నెలల వయసు వచ్చే దాకా ఈ ఊయల ఉపయోగపడుతుంది.

Leave a comment